బీజేపీ జిల్లా కమిటీ ఎన్నిక

ABN , First Publish Date - 2020-12-12T04:33:32+05:30 IST

భారతీయ జనతాపార్టీ అనుబంధ సంఘాల కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు.

బీజేపీ జిల్లా కమిటీ ఎన్నిక
బీజేపీ యువమోర్చా జిల్లా అద్యక్షుడు అనంతు ఉపేందర్‌గౌడ్‌

ఖమ్మం మయూరిసెంటర్‌, డిసెంబర్‌ 11: భారతీయ జనతాపార్టీ  అనుబంధ సంఘాల కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా అనంతు ఉపేందర్‌ గౌడ్‌, ఖమ్మం త్రీటౌన్‌ ఏరియా ప్రెసిడెంట్‌గా కొణతం లక్ష్మీనారాయణ, అర్బన్‌టౌన్‌ అధ్యక్షుడిగా కుమిలి శ్రీనివాస్‌రావు, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎండి అన్వర్‌ఖాన్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో వారికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి నియామక పత్రాలు అందచేశారు.  రానున్న కాలంలో పార్టీ అభివృద్ధికి, కార్పొరేషన్‌ ఎన్నికల్లో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. 

పదవులు దక్కలేదంటూ బీజేపీ నాయకుల నిరసన 

 జిల్లా కమిటి, నగర కమిటీలో ఎలాంటి పదవులు ఇవ్వకుండా, కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇచ్చి జిల్లా అధ్యక్షుడు పక్షపా తంగా వ్యవహరి స్తున్నాడని బీజేపీ నాయకులు  నిరసన తెలిపారు. దనియాకుల వెంకట నారాయణ, రేపాకుల సైదులు లింగరాజులు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు దిగారు. నిరంతరం పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తున్న తమకు కాకుండా ఇటీవల పార్టీలో చేరినవారికి పదవులు ఇవ్వడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్న జిల్లా అధ్యక్షుడుపై రాష్ట్ర కమిటికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ దీక్షలో పలువురు అసంతృప్తి బీజేపీ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-12T04:33:32+05:30 IST