‘పట్టభద్రుల ఎమ్మెల్సీ’ని కైవసం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-10-03T11:18:04+05:30 IST
మూడు ఉమ్మడిజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించడానికి కృషిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ..
వైరా, అక్టోబరు 2: మూడు ఉమ్మడిజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించడానికి కృషిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం వైరాలో బీజేపీ నియోజకవర్గస్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి చేరువగా వచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై యువతలో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. ప్రధాని మోదీ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కీలకం కాబోతుందని, అధిక సంఖ్యలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదుచేయించాలని పిలుపునిచ్చారు.
అయ్యప్ప ఆలయం నుంచి జాతీయ ప్రధాన రహదారి మీదుగా వాసవీ కల్యాణమండపం వరకు సత్యనారాయణను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సన్నే ఉదయ్‌ప్రతాప్, వైరా నియోజకవర్గ కన్వీనర్ బండారు నగేష్, రాష్ట్ర, స్థానిక నాయకులు దేవకి వాసుదేవరావు, దిద్దుకూరి వెంకటేశ్వరరావు, దొంగల సత్యనారాయణ, సంపసాల వరదరాజు, దొడ్డా అరుణ, ఏలే భద్రయ్య, తిప్పతి మల్లిఖార్జున్, నల్లపోతుల రమేష్, శ్రీనివాస్, నకిరికంటి వీరభద్రం, రాంప్రసాద్, గుత్తా నాగేశ్వరరావు, ఏపూరి శ్రీనివాసరావు, రామిశెట్టి బాబూరావు, కోసూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు.