భర్తే కాలయముడు

ABN , First Publish Date - 2020-12-14T04:32:16+05:30 IST

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.

భర్తే కాలయముడు
మృతదేహం కోసం వెదుకులాడుతున్న పోలీసులు

 భార్యను చంపి,  కనిపించడంలేదంటూ ఫిర్యాదు

 అనుమానంతో ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబసభ్యులు

 మిస్టరీని చేధించిన పోలీసులు

కారేపల్లి/ఇల్లెందుటౌన్‌/ టేకులపల్లి డిసెంబరు13: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  టేకులపల్లి మండలం హనుమాతండాకు చెందిన గుగులోత్‌ మంగ(35)ను భర్త భాస్కర్‌ ఈనెల 2న హత్యచేసి ఇల్లెందు-కారేపల్లి మధ్యలో గల ఓసీ గనుల వద్ద పడేశాడని, విషయం బయటపడకుండా ఈనెల 5న టేకులపల్లి పోలీసు స్టేషన్‌లో తన భార్య కనిపించడంలేదని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. అయితే మంగ కుటుంబ సభ్యులు భర్త పైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు తమదైనా శైలిలో విచారించడంతో తనే తన భార్యను హత్యచేసినట్టు ఒప్పుకున్నాడన్నారు. పాల్వంచ డీఎ్‌సపీ కెఆర్‌కె ప్రసాదు ఆధ్వర్యంలో అదివారం సాయంత్రం  టేకులపల్లి, ఇల్లెందు, కారేపల్లి పోలీసులు సంఘటన స్థలంలో మంగ శవాన్ని గుర్తించారు. ఖమ్మం పట్టాణానికి చెందిన అన్నెం శ్రీనివా్‌సరావు, అతని సిబ్బంది సహకారంతో 4గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు మంగ శవాన్ని బయటకు తీశారు. అక్కడే ఇల్లెందు వైద్యులు కిషోర్‌ పంచానామ నిర్వహించారు. అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించారు.ఈకార్యక్రమంలో టేకులపల్లి సీఐ రాజు, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, ఇల్లెందు సీఐ రమేష్‌, ఎస్‌ఐ శ్రీను, కారేపల్లి సీఐ శ్రీనివా్‌సలు, ఏ ఎస్‌ఐ కృష్ఫప్రసాదు తదితరులు పాల్గొన్నారు. కాగా మృతురాలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Updated Date - 2020-12-14T04:32:16+05:30 IST