భద్రాద్రి రామయ్యకు రాపత్తుసేవ

ABN , First Publish Date - 2020-12-29T05:23:55+05:30 IST

భద్రాద్రి రామయ్యకు రాపత్తుసేవ

భద్రాద్రి రామయ్యకు రాపత్తుసేవ
రాపత్తుసేవ నిర్వహిస్తున్న దృశ్యం

శ్రీకృష్ణదేవాలయం ఆధ్వర్యంలో నిర్వహణ
భద్రాచలం, డిసెంబరు 28: భద్రాద్రి రామాలయంలో నిర్వహిస్తున్న రాపత్తుసేవల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామికి శ్రీకృష్ణదేవాలయం ఆధ్వర్యంలో రాపత్తుసేవ నిర్వహించారు. ముందుగా స్వామి అలంకరించి చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అనంతరం సింహాసనంపై స్వామి వారిని ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయం తరపున నిర్వాహకులు పాల్గొన్నారు. 
రామయ్యను దర్శించుకున్న యండమూరి 
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాఽథ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ తమ పూర్వీకులది భద్రాచలమేనని పేర్కొన్నారు. తాను 20ఏళ్ల తరువాత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నానని తెలిపారు. 

Updated Date - 2020-12-29T05:23:55+05:30 IST