వరదల వేళ అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-08-16T11:03:02+05:30 IST

గోదావరి వరద పెరుగుతున్న నేపద్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాలని జిల్లా

వరదల వేళ అప్రమత్తంగా ఉండాలి

నిత్యావసరాల కొరత లేకుండా చూడండి 

అధికారులను ఆదేశించిన భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి 


కొత్తగూడెం కలెక్టరేట్‌, ఆగసు 15:  గోదావరి వరద పెరుగుతున్న నేపద్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు.  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపద్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద నియంత్రణలోకి వచ్చే వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.


అత్యవసర పరిస్థితి ఉన్నందున తక్షణం సేవలకు ప్రభుత్వ సిబ్బంది తమ కార్యాస్థానాల్లో అందుబాటులో ఉండాలన్నారు. లేకపోతే విధులనుంచి తొలగిస్తామని హెచ్చరించారు.  ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు అన్ని తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాలతో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు జిల్లా కేంద్రాల్లో డీపీఓ 7093335563, వైద్య 08744246655, సబ్‌కలెక్టర్‌ 08743232444, ఆర్డీఓ 08744249994. మున్సిపాల్టీలు కొత్తగూడెం 8179478968, పాల్వంచ 9849907600, మణుగూరు 7093404721, ఇల్లెందు 7995890476, కలెక్టరేట్‌ 8744241950 కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశామని తెలిపారు. 

Updated Date - 2020-08-16T11:03:02+05:30 IST