వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-07-15T11:25:20+05:30 IST

ప్రస్తుత సీజన్‌లో పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వీటి పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో జయరాం కోరారు.

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

తిరుమలాయపాలెం, జూలై 14: ప్రస్తుత సీజన్‌లో పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వీటి పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో జయరాం కోరారు. మంగళవారం మండలంలోని బచ్చోడు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బానోతు బిక్షం, గుగులోతు నరేష్‌, కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-15T11:25:20+05:30 IST