చట్టాలను తెలుసుకుని మెలగాలి
ABN , First Publish Date - 2020-12-20T04:52:00+05:30 IST
బాలల హక్కుల అన్నిచట్టాలను తెలుసుకుని, వారితో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌కే భూపతి అన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భూపతి
ఖమ్మంలీగల్, డిసెంబరు19: బాలల హక్కుల అన్నిచట్టాలను తెలుసుకుని, వారితో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌కే భూపతి అన్నారు. శనివారం న్యాయసేవవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జువనైల్ పోలీసు, తత్సంబంధిత అధికారుల ఒక్కరోజు శిక్షణను ఆయన ప్రారంభించారు. జువైనల్ జస్టిస్ చట్టం కింద చట్టంలో ఘర్షణ పడిన బాలలను ప్రత్యేకంగా పరిగణించాలని చట్టం చెబుతోందన్నారు. చట్టం గురించి పోలీసులకుసరైన అవగాహన లేకపోతే పొరపాట్లు దొర్లే అవకాశం ఉందన్నారు. జువనైల్ జస్టిస్ బోర్డు , బాలల సంక్షేమ మండలి మొదలైన విభాగాలు పనితీరుపట్ల అవగాహన పెంచుకో వాలని సూచించారు. నేరం జరిగినప్పుడు నేరం చేసిన వ్యక్తి 18 సంవత్సరాలోపు వయస్సు ఉండవచ్చని సంబంధిత మెజిస్ర్టేట్ భావిస్తే, ఆకేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపి వయస్సు నిర్ధారణ చేయించాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి మహ్మద్ అప్రోజ్ అక్తర్ మాట్లాడుతూ చట్టంతో ఘర్షణ పడిన బాలురు, సంరక్షణ అవసరమైన బాలురు గురించి జువనైల్ జస్టిస్ చట్టం వివరిస్తుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపుడి తాజుద్దీన్‌బాబా మాట్లాడుతూ పని వత్తిడిలో ఉండే పోలీసులు బాలల పట్ల అనుసరించాల్సిన విధా నాలను వివరించడానికి శిక్షణ అవసరమన్నారు. జువనైల్ బోర్డు మెజిస్ర్టేట్ ఎన్. అనితా రెడ్డి, న్యావాది ఎన్.శ్రీనివాసశర్మ జిల్లా బాలల రక్షణాధికారి టి.విష్ణువందన, బాలల సంక్షేమ మండలి చైర్మన్ ఎంఎల్ ప్రసాద్ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణకు లైజన్ అధికారి పారుపల్లి భాస్కర్‌రావు, పోలీసు అధికారులు, ప్యానల్ న్యాయవాదులు, సంబంధిత ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.