రైతు ఉద్యమానికి మద్దతుగా..
ABN , First Publish Date - 2020-12-08T05:12:09+05:30 IST
రైతు ఉద్యమానికి మద్దతుగా..

నేటి భారత్ బంద్‌లో బీజేపీ మినహా అన్నీ రాజకీయపార్టీల భాగస్వామ్యం
అన్నీ వ్యాపార, వాణిజ్య సముదాయాలు బంద్
సంపూర్ణ మద్ధతు ప్రకటించిన అధికారపార్టీ
ఖమ్మం, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయా లని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్య మానికి సంఘీభావంగా భారత్‌బంద్ పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా బంద్ జరగనుంది. బంద్‌కు బీజేపీ మినహా అన్నీ రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. వాటితోపాటుగా అధికారపార్టీ సైతం బంద్‌కు మద్ధతు ప్రకటించింది.బంద్‌ను జయప్రదం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా కదిలి విజయవంతం చేయాలని ఆయా పార్టీల నేతలు పిలుపునిచ్చారు. మూడు చట్టాలు రైతులు, కూలీలకే కాదు వ్యాపారులకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని, వ్యాపారులు గమనించాలని వామపక్షాల నేతలు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి ప్రతీ ఒక్కరూ సంఘీభావం తెలిపి బంద్‌కు సహకరించాలని కోరారు. కాగా నేడు జరిగే బంద్‌లో భాగంగా బైపాస్ రోడ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరిగే నిరసనలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొనను న్నారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు కూడా బంద్‌లో పాల్గొననున్నారు.