పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధపూజ

ABN , First Publish Date - 2020-10-27T10:24:55+05:30 IST

దసరా పండుగ సందర్భంగా నగరంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసు ఆయుధాలకు ఆయుధపూజ నిర్వహించారు

పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధపూజ

ఖమ్మంక్రైం, అక్టోబరు 26: దసరా పండుగ సందర్భంగా నగరంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసు ఆయుధాలకు ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ శక్తిగా ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతీ ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అన్నారు. విజయం చేకూర్చే విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.  తుపాకీ పేల్చి ఆయుధపూజ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఏడీసీపీ మాధవరావు, ఆర్‌ఐలు రవి, శ్రీనివాస్‌, సాంబశివరావు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-10-27T10:24:55+05:30 IST