మహరాష్ట్ర కూలీలకు కరోనాపై అవగాహన
ABN , First Publish Date - 2020-03-25T11:28:22+05:30 IST
కామేపల్లి మండలపరిధిలోని పింజరమడుగు, టేకులతండ, రుక్కితండ, గోవింద్రాల గ్రామాలకు వలస వచ్చిన మహరాష్ట్ర కూలీలకు కరోనాపై మంగళవారం అవగాహన కల్పించారు.

కామేపల్లి, మార్చి 24: కామేపల్లి మండలపరిధిలోని పింజరమడుగు, టేకులతండ, రుక్కితండ, గోవింద్రాల గ్రామాలకు వలస వచ్చిన మహరాష్ట్ర కూలీలకు కరోనాపై మంగళవారం అవగాహన కల్పించారు. గ్రామాలలో పర్యటించి అవగాహన కల్పించారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఎమైన వస్తే వెంటనే గ్రామంలోని సర్పంచ్‌కు లేదా ఆశవర్కర్లకి గానీ, అంగన్‌వాడీ టీచర్లకు గానీ తెలియపరచాలని వారికి సూచించారు. పింజరమడుగులో పూణే, బెంగళూరు నుంచి వచ్చిన యువకుల ఇళ్లను పరిశీలించారు. గోవింద్రాలలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కనకం నర్సింహరావు, ఎంపీడీవో పీవిఎ్‌సఎన్ గుప్తా, మెడికల్ ఆఫీసర్ స్రవంతి, కళావతి, జ్యోతి లక్ష్మి, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.