కరోనాపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2020-03-08T12:01:24+05:30 IST
కరోనా వైరస్‌పై ప్రజ లకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శా ఖ మంత్రి ఈటెల రాజేందర్

ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరు జిల్లాల అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల ఆదేశం
ఖమ్మంసంక్షేమ విభాగం/ కొత్తగూడెం కలెక్టరేట్ మార్చి 7: కరోనా వైరస్‌పై ప్రజ లకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శా ఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. శ నివారం హైదరాబాద్ నుంచి ఇరు జిల్లాల వై ద్యారోగ్య శాఖ అధికారులతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఇతర దేశాలకు వెళ్లి తిరి గి స్వగ్రామాలకు వచ్చిన వారి వివరాలను ఎ ప్పటికప్పుడు సేకరించాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై 14రోజుల వరకు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ మేరకు గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలను అ ప్రమత్తం చేయాలన్నారు. కరోనా పై విద్యార్ధులకు, స్వయం సహాయక సంఘాలకు, సమూహల్లో ఉన్న వారికి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని, అలాగే మాస్కుల స్థానంలో చేతి రుమాలను కట్టుకునేలా సూచించాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారి నమూనాలు, రోగులను మాత్రమే గాంధీ ఆసుపత్రికి పంపాలని పేర్కొన్నారు. మంగళవారం వీశాట్ శానల్ ద్వారా విద్యార్ధులకు ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కల్పిస్తా మన్నారు. వీడియో కాన్పరెన్స్‌లో ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ఐడీఎ్‌సపీ పీవో డాక్టర్ కొటిరత్నం, డీఎంవో డాక్టర్ సైదులు, ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కృపాఉషశ్రీ, ఆర్‌ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, జాతీయ ఆరోగ్య మిషన్ ప్రాంతీయ అధికారిణి నీలోహాన, డీపీహెచ్‌ఎన్ విమల, హెల్త్ పర్యవేక్షకులు తాళ్లూరి శ్రీకాంత్, నాగరాజు, రాజేశ్, భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్, ఐడీఎస్‌పీ డాక్టర్ శ్రీనునా యక్ పాల్గొన్నారు.