నియంత్రిత సాగుపై అవగాహన

ABN , First Publish Date - 2020-05-30T10:29:02+05:30 IST

నియంత్రిత పంటల సాగుపై అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

నియంత్రిత సాగుపై అవగాహన

ఏన్కూరు/ రఘనాథపాలెం/ చింతకాని/ బోనకల్‌/ కామేపల్లి/ నేలకొండపల్లి, మే 29: నియంత్రిత పంటల సాగుపై అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం ఏన్కూరు, రఘునాథపాలెం, చింతకాని, బోనకల్‌, కామేపల్లి, నేలకొండపల్లిలో సమావేశాలు నిర్వహించారు. ఏన్కూరులో జరిగిన సమావేశంలో ఏడీఏ బాబూరావు పాల్గొన్నారు. పత్తిలో అంతరపంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.


ఈకార్యక్రమంలో జిల్లా సూపర్‌వైజర్‌ వెంకటేశ్వర్లు ఏఈవో నర్సింహారావు, రైతులు పాల్గొన్నారు. రఘునాథపాలెంలో నిర్వహించిన సదస్సులో ఖమ్మం వ్యవ సాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు శ్రేయ స్సే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అందులో భాగంగానే నియంత్రిత సాగును ప్రవేశపెట్టారన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ భూక్యా గౌరి, జడ్పీటీసీ ప్రియాంక, సర్పంచ్‌ గుడిపుడి శారద, ఆత్మచైర్మన్‌ బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌లు మందడపు సుధాకర్‌, తాతా రఘురాం, ఏవో భాస్కర్‌, కుర్రా భాస్కర్‌, ఉపసర్పంచ్‌ కుందేసాహెబ్‌, గుడిపుడి రామారావు తదితరులు పాల్గొన్నారు.


నేలకొండపల్లిలో నిర్వహించిన సదస్సులో కూసుమంచి వ్యవసాయ శాఖ సహాయ సం చాలకుడు విజయ్‌చందర్‌ పాల్గొన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఆధారంగా రైతులు పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. సర్పంచ్‌ రాయపుడి నవీన్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.  సదస్సులో రైతుబంధు మండల కన్వీనర్‌ యడవల్లి సైదులు, ఎంపీటీసీ బొడ్డు బొందయ్య పాల్గొన్నారు. కామేపల్లిలో జరిగిన సదస్సులో జేడీఏ ఝా న్సీలక్ష్మీకుమారి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూ చించారు. వానాకాలం సాగుకు సంబంధించి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రభు త్వం సూచించిన పంటలే సాగు చేయాలని వివరించారు.


కార్యక్రమంలో ఏడీఏ బి.సరిత, ఏడీఏ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వెంకటప్రవీన్‌కుమార్‌ నాయక్‌, రైతుసమన్వయ సమితి కోఆర్డీనేటర్‌ ఉపేందర్‌, సర్పంచ్‌ శిలాసాగరపు కోటయ్య, ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌చౌదరి, ఎంపీటీసీ మాలోత్‌ శంకర్‌, ఏవో తారాదేవి, ఏఈవోలు మహేష్‌, జగదీష్‌, గింజల నర్సిరెడ్డి పాల్గొన్నారు. బోనకల్‌, చింతకానిలో నిర్వహించిన సదస్సులకు ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట మార్పిడి రైతులకు ప్రయోజనకరమన్నారు. కా ర్యక్రమంలో ఎంపీపీ కొంకణాల సౌభాగ్యం, సర్పంచ్‌ శాంతయ్య.


ఎంపీటీసీ శ్రీలక్ష్మీ, తహసీల్దార్‌ రాధిక, ఎంపీడీవో శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బందం శ్రీనివాసరావు, రైతు సమితి సభ్యులు మందడపు తిరుమలరావు, వేమూరి ప్రసాద్‌, గద్దల వెంకటేశ్వర్లు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్లు, జిల్లా సభ్యుడు మంకెన రమేష్‌, మం డల కన్వీనర్‌ మనోహర్‌, జడ్పీటీసీ కిశోర్‌, ఎంపీపీ పూర్ణయ్య, తహసీల్దార్‌ తిరుమలచారి, సర్పంచ్‌ అలస్యం నాగమణి, ఎంపీటీసీ నాగరత్నం, ఏవో నాగయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T10:29:02+05:30 IST