అల్లుడుపై పోలీసులకు అత్త ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-06-22T10:34:54+05:30 IST

సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన దాసరి పాపాయమ్మ అనే మహిళ తన అల్లుడు, కుమార్తెపై సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు

అల్లుడుపై పోలీసులకు అత్త ఫిర్యాదు

ఉన్నతాధికారుల పేరుతో బెదిరిస్తున్నాడని ఆరోపణ


సత్తుపల్లి, జూన్‌ 21: సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన దాసరి పాపాయమ్మ అనే మహిళ తన అల్లుడు, కుమార్తెపై సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం తనకు ముగ్గురు కుమార్తెలు, అల్లుళ్లు ఉన్నారని, తన భర్త గతేడాది మరణించారని పేర్కొన్నారు. ఆయన మరణం అనంతరం ఆస్తి పంచి ఇవ్వాలని ఒక కుమార్తె, అల్లుడు వత్తిడి చేయటంతో వ్యవసాయ భూమి పంచి ఇచ్చామని, తన వాటాతో పాటు ఇల్లు, ఇళ్ల స్థ లం కూడా పంచి ఇవ్వాలని వత్తిడి చేస్టూ, తన భర్త పేరుతో ఉన్న బ్యాంకు లాక ర్‌ తాళం. ఏటీఎం కార్డు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త బ్యాం కు ఖాతాలో ఉన్న రూ.1,67,.500 నగదు కూడా లేకుండా పోయాయని, బ్యాంకు లో సంప్రదించగా ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు బ్యాంకు అధికారులు చెపుతున్నారని పేర్కొన్నారు. పెద్ద మనుషులు చెపుతున్నా వినకుండా ఆస్తికోసం తనను వేధిస్తూ, తనపై భౌతికంగా దాడి చేశారని  ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


పోలీసు అధికారి పేరుతో బెదిరింపు..

పోలీసు ఉన్నతాధికారి ఒకరు తనకు అండగా ఉన్నారని చెపుతూ తన అల్లుడు తనను మానసికంగా వేధించటమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నారని ఆమె విలేకర్ల వద్ద ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారి అండదండలున్న కారణంగా తనకు స్థానికంగా న్యాయం కూడా జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించి తనకు న్యాయం చేయాలని ఆమె ఉన్నతాధికారులను వేడుకున్నారు. తన ఆస్తికి, తనకు రక్షణ కల్పించాలని కోరారు.  

Updated Date - 2020-06-22T10:34:54+05:30 IST