రామయ్య సేవలో ఏపీ హైకోర్టు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌

ABN , First Publish Date - 2020-12-27T04:15:24+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఏపీ హైకోర్టు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌.హరినాథ్‌ కుటుంబ స మేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.

రామయ్య సేవలో ఏపీ హైకోర్టు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌
రామాలయంలో ఏపీ హైకోర్టు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌

భద్రాచలం, డిసెంబరు 26: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఏపీ హైకోర్టు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌.హరినాథ్‌ కుటుంబ స మేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అ నంతరం లక్ష్మీతాయారు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఈవో బి.శివాజీ కలిసి ఆలయాభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంవీ ప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్‌, పడవల శ్రీనివాసు, పేరాల నాగరాజు, పీఆర్‌ తిరుమలరావు, సత్యనారాయణ, మల్లిఖార్జునరావు, ఈసంపల్లి శ్రీనివాసు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T04:15:24+05:30 IST