మరో పాజిటివ్‌ కేసు

ABN , First Publish Date - 2020-06-18T10:22:43+05:30 IST

ఖమ్మం జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు ఆ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాలతి బుధవారం

మరో పాజిటివ్‌ కేసు

ఖమ్మం జిల్లా తల్లాడ యువకుడికి సోకిన కోవిడ్‌-19 

ఏపీ మూలంగా గుర్తించిన వైద్యశాఖ


ఖమ్మం సంక్షేమవిభాగం/తల్లాడ, జూన్‌ 17: ఖమ్మం జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు ఆ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాలతి బుధవారం ప్రకటించారు. జిల్లాలోని తల్లాడకు చెందిన ఓ యువకుడు విజయవాడలో ఓ ప్రైవేట్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమలోఓ అతడు గత శనివారం తల్లాడలోని తల్లిదండ్రుల వద్దకు రాగా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అతడిని గుర్తించారు. అతడికి జ్వరం, జలుబు, దగ్గు ఉండడంతో తల్లాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాధమిక వైద్యపరీక్షలు నిర్వహించి కరోనా అనుమానంతో సోమవారం జిల్లా ఆసుపత్రికి పంపారు. అక్కడ అతడి శాంపిల్స్‌ సేకరించి వరంగల్‌ ల్యాబ్‌కు పంపగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 


అప్రమత్తంగా వ్యవహరించిన తల్లాడ వైద్యాధికారులు

ఏపీ నుంచి వచ్చిన యువకుడిని తల్లాడ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వెంటనే గుర్తించి వెంటనే  హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తంగా వ్యవహరించి జిల్లా ఆసుపత్రికి పంపటంతో తల్లాడలో అతడి ద్వారా ప్రైమరీ కాంటాక్టుల సంఖ్య తక్కువగా నమోదయ్యాయి. 

Updated Date - 2020-06-18T10:22:43+05:30 IST