లక్ష్య సాధనలో వెనుకబాటుపై ఆగ్రహం

ABN , First Publish Date - 2020-09-20T06:37:06+05:30 IST

జిల్లాలో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ.4,260కోట్లు రుణ ప్రణాళిక లక్ష్యం కాగా కేవలం రూ.476.39 కోట్లు లక్ష్యం సాధించి 11.18 శాతం మాత్రమే ఉండటంపై అధికారులపై కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు...

లక్ష్య సాధనలో వెనుకబాటుపై ఆగ్రహం

వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష


కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబరు 19: జిల్లాలో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ.4,260కోట్లు రుణ ప్రణాళిక లక్ష్యం కాగా కేవలం రూ.476.39 కోట్లు లక్ష్యం సాధించి 11.18 శాతం మాత్రమే ఉండటంపై అధికారులపై కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశపు హాలులో డీఆర్‌డీఏ, వ్యవసాయ, ఎస్సీ, బీసీ, కార్పొరేషన్‌, పశుసంవర్థక, మత్సశాఖ, ఐటీడీఏ, మున్సిపల్‌ కమీషనర్లతో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వ హించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 30వ తేదీ నాటికి నిర్వహించాల్సిన డీఆర్‌సీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఓ రుణాలు మంజూరుకు నిర్ధేశించిన లక్ష్యా లపై సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్య తాంశాలకు రుణాలు మంజూరుకు బ్యాంకర్లు అంగీకరించి రుణాలు సకాలంలో మంజురు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. వార్షిక రుణ ప్రణాళిక చాలా పూర్‌గా ఉం దన్నారు. 25శాతం కూడా పంటరుణాలు అందచేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రాధాన్యత, ఇతర ప్రాధాన్యతా రం గాలకు రుణాలు మంజూరులో బ్యాంకు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు మం జూరులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫెర్మామెన్సు అ త్యం త దారుణంగా ఉందన్నారు. ఎస్బీఐ పార్టనర్‌ బ్యాంకుగా వ్యవహారిస్తుందని అయినప్పటికీ ప్రాధాన్యతను గుర్తించి రుణాలు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నా రని, ప్రభుత్వానికి నివేధికలు పంపడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల, జీతభత్యాలు, డిపాజిట్లు సకాలంలో రుణాలు మంజూరుచేస్తూ ప్రజలకు అండగా ఉండే బ్యాంకులకు వా టిని బదలాయింపుచేస్తామన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో 12వేల మంది వీధి వ్యాపారాలు నిర్వహిస్తు న్నట్లు గుర్తించామని వారిలో 8వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తిచేయగా కేవలం 2వేల మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారన్నారు. కరోనా వ్యాధి వల్ల వీధి వ్యాపారులు ఆర్థికపరమైన ఇబ్బందులకు  గురవుతున్నా ర ని, వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని ఆదేశించిందన్నారు. అయినా బ్యాం కు అధికారులు రుణాలు మంజూరు చేయక పోవడం విచా రకరమన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ అనుదీప్‌, ఎల్డీఎం శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ మధుసూధన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-20T06:37:06+05:30 IST