తల్లిదండ్రుల చెంతకు మతిస్థిమితం లేని బాలిక

ABN , First Publish Date - 2020-03-13T12:26:52+05:30 IST

తల్లిదండ్రుల చెంతకు మతిస్థిమితం లేని బాలిక

తల్లిదండ్రుల చెంతకు  మతిస్థిమితం లేని బాలిక

తల్లాడ, మార్చి 12: తల్లాడ బస్టాండ్‌లో మతిస్థిమితం లేని బాలికను గురువారం ఆమె తల్లిదండ్రులకు బ్లూకోర్ట్స్‌ కానిస్టేబుల్‌ అప్పగించారు. తల్లాడ మండలం అంజనాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ బస్‌డ్రైవర్‌ కర్నాటి గోపాల్‌ దంపతులు కుమార్తె యశ్వంతతో అనంతారం వెళ్లేందుకు తల్లాడ బస్టాండ్‌కు వచ్చారు. బస్టాండ్‌లో తల్లిదండ్రుల నుంచి బాలిక తప్పిపోయింది. బాలికను బ్లూకోర్ట్స్‌ కానిస్టేబుల్‌ బాలాజీ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

Updated Date - 2020-03-13T12:26:52+05:30 IST