రైతుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-02T02:31:07+05:30 IST
మోదీ ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకుని రైతుల సమస్యలు పరిష్కరించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మర్లపాటి రేణుక కోరారు.

భద్రాచలం, డిసెంబరు 1: మోదీ ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకుని రైతుల సమస్యలు పరిష్కరించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మర్లపాటి రేణుక కోరారు. ఐద్వా పట్టణ కమిటీ సమావేశం డి.సీతాలక్ష్మీ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతాంగం సాగిస్తున్న పోరాటానికి ఐద్వా సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. అప్రజాస్వామిక రీతిలో ఇటీవల పార్లమెంటులో ఆమోదించపజేసుకున్న మూడు వ్యవసాయ బిల్లులను, విద్యుత్తు సవరణ బిల్లును రద్దు చేయాలని అన్నారు. తమ గోడు వినాలని లక్షలాది వుమంది రైతాంగం దేశ రాజధిని ఢిల్లీలో కదం తొక్కుతున్నారని అన్నారు. వారి గోడు పట్టించుకోకుండా వారిపై దమన కాండ సాగించడం సరికాదని ఆమె అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఆఫీస్ బేరర్ ఎన్. లీలావతి, జిల్లా కమిటీ సభులుఉ బి.కుసుమ, యు.జ్యోతి, సున్నం గంగ, మడెం లక్ష్మీ, కాకా రమణ, పి.జయ, ధనలక్ష్మి, విజయ, సరోజిని తదితరులు పాల్గొన్నారు.