అదుపు తప్పిన ద్విచక్ర వాహనం: ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-11-27T04:31:37+05:30 IST

ద్విచక్ర వాహనం అదుపు తప్పటంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది.

అదుపు తప్పిన ద్విచక్ర వాహనం: ఒకరి మృతి

రఘునాథపాలెం నవంబరు 26: ద్విచక్ర వాహనం అదుపు తప్పటంతో ఒకరు మృతి చెందారు.  ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది.  ఎస్‌ఐ వరాల శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని ఈర్లపుడి గ్రామానికి చెందిన ధారావత్‌ మూర్తి(44) ఖమ్మం రూరల్‌ మండలం ఆర్కోడు గ్రామానికి చెందిన గుగులోత్‌ హరి, ధారావత్‌ మూర్తి ద్విచక్ర వాహనంపై కామేపల్లి మండలం లింగాల వద్ద ఉన్న పురుగుమందుల దుకాణంలో మందుల కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బూడిదంపాడు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఇద్దరు కిందపడి పోయారు. మూర్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆసుప్పతికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-11-27T04:31:37+05:30 IST