నెత్తురోడిన రహదారులు

ABN , First Publish Date - 2020-12-06T04:57:59+05:30 IST

జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదురుగు వ్యక్తులు మృతిచెందారు. రోడ్డు ప్రమాదాల్లో నలుగు రు మృతిచెందగా, పశువు ఢీ కొనడంతో ఒకరు, రైలుకిందపడి మరొకరు దుర్మరణం చెందారు. ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.

నెత్తురోడిన రహదారులు
మృతుడు సాయికుమార్‌

 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

 ఐదుగురికి గాయాలు

జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదురుగు వ్యక్తులు మృతిచెందారు. రోడ్డు ప్రమాదాల్లో నలుగు రు మృతిచెందగా, పశువు ఢీ కొనడంతో ఒకరు, రైలుకిందపడి మరొకరు దుర్మరణం చెందారు. ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.

బోనకల్‌, డిసెంబరు 5: మండలంలోని రావినూతల గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఖమ్మం వైఎస్సార్‌ నగర్‌కు చెందిన వాంకుడోతు సాయి కుమార్‌(21) ద్వి చక్ర వాహనం పై రావినూతల నుంచి ఖమ్మంకు వెళ్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి వివాహం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టర్‌ నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ కొండలరావు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.


ద్విచక్రవాహనం అదుపుతప్పి..


కామేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మృతిచెందాడు. సంఘటన కామేపల్లి మండలం అడవిమద్దులపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏన్కూరు మండలం మూల పోచారం గ్రామానికి చెందిన మూడ్‌ వెంకన్న (35)ఈనెల 4న తన  ద్విచక్ర వాహనంపై ఖమ్మం వెళ్లి తిరిగి రాత్రి పదిగంటల సమయంలో మద్దులపల్లి సమీపంలో గల నిమ్మవాగు దగ్గర అదుపు తప్పి గుంటలో పడింది. వెంటనే స్థానికులు గమనించి 108లో ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ స్రవంతి తెలిపారు. 


రోడ్డు దాటుతూ వృద్దుడు..


కొణిజర్ల: మండల పరిధిలోని తనికెళ్ళ దగ్గర శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్దుడు మృతి చెందాడు. ఎస్‌ఐ మొగిలి తెలిపిన వివరాలు ప్రకారం వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన శ్రీగిరి వేణుగోపాలరావు(75) తనికెళ్లలో రోడ్డు దాటుతుండగా ఖమ్మం నుంచి కొణిజర్ల వైపు వస్తున్న ద్విచక్రవాహనం డీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్దుడు క్రింద పడటంతో తలకు తీవ్రగాయాలు అయి అక్కడకుఅక్కడే మృతి చెందాడు. మృతుడు వి.వెంకటాయపాలెం సమీపంలో హోటల్‌ నడుపుతున్న కూతురు ఇంటికి వస్తున్నట్లు తెలిసింది. తనికెళ్ళ దగ్గర విద్యుత్‌సబ్‌స్టేషన్‌లో తన అల్లు డు పని చేస్తుండటంతో అక్కడ దిగి ఉండవచ్చని, మరల వెంకటాయపాలెం వచ్చే క్రమంలో తనికెళ్ళ మెయిన్‌రోడ్డు దగ్గర రోడ్డుదాటుతుండగా ప్రమాదం జరిగిందని పొలీ్‌సలు బావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


పశువు ఢీకొనడంతో ..


సత్తుపల్లిరూరల్‌: తెల్లవారుజామున ఇంటిలోని పశువు వ్యక్తి పొట్టపై ఢీకొనడంతో రక్తపు వాంతులు అవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. మండలంలోని బేతుపల్లికి చెందిన జోనెబోయిన ధర్మయ్య (58) బహిర్భూమికని నిద్రలేవగా పశువు తలతో అతని పొట్టపై బలంగా గుద్దడంతో రక్తపు వాంతులు అవ్వడంతో మృతిచెందాడు. సీఐ రమాకాంత్‌, ఎస్‌ఐ జీ.నరేష్‌ మృతదేహాన్ని పరిశీలించగా కుమారుడు దేవరాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య


ఎర్రుపాలెం: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎర్రుపాలెంలో చోటుచేసుకుంది. ఎర్రుపాలెం గ్రామానికి చెందిన పులి రామదాసు(54) కొద్దిరోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కిలోమీటర్‌ 545/10/12 వద్ద గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.



Updated Date - 2020-12-06T04:57:59+05:30 IST