రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2020-12-07T03:01:36+05:30 IST

అశ్వారావుపేట మండలం వినాయకపురం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రో డ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మరో ఏడుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

అశ్వారావుపేట రూరల్‌, డిసెంబరు 6: అశ్వారావుపేట మండలం వినాయకపురం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రో డ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదబాదితులంతా ఆంధ్రాలోని కుక్కునూరు మండల వాసులు. ఇందుకు సంబందించి వి వరాల్లోకి వెళితే కుక్కునూరు మండలంలోని అమరవరం పంచాయతీ రాజీవ్‌నగర్‌కు చెం దిన ఎనిమిది మంది యువకులు మండలంలోని వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం వద్దకు వచ్చారు. ఆలయం వద్ద భోజనాల అనంతరం తిరిగి టాటా మ్యాజిక్‌ వాహనంలో తిరుగు పయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న కల్వర్టును బలంగా ఢీకొంది. ప్రమాదంలో క్యాబిన్‌లో ఉన్న ముక్కెర శివ(26) లోపల ఇరుక్కుపోయాడు. తీవ్రగాయాలు అయిన శివ అక్కడిక్కడే మృతిచెందాడు.వాహనంలో ఉన్న వల్లాల రత్నకుమార్‌, బొల్లి శివప్రసాద్‌, పూనెం జీవన్‌బాబు, కృష్ణమూర్తి, గవర్ణ శ్రీను, శివరామకృష్ణ, సంకా ప్రవీణ్‌కు తీవ్రంగా గాయాలు అయ్యాయి. రత్నకుమార్‌, శివప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ మధు ప్రసాద్‌ సందర్శించారు. మృతదేహం క్యాబిన్‌లో ఇరుక్కుపోవటంతో కట్టర్‌ సహాయంలో కట్‌చేసి మృతదేహాన్ని బయటకు తీయించారు. క్షతగాత్రులను అశ్వారావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడు శివ వివాహితుడు. పోలీసులు వివరాలు సేకరించారు. 


Read more