నేటినుంచి కార్పొరేట్‌ కాలేజీలకు దరఖాస్తులు స్వీకరణ

ABN , First Publish Date - 2020-10-03T11:20:18+05:30 IST

షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించే కార్పొరేట్‌ కాలేజీల్లో చేరేందుకు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ..

నేటినుంచి కార్పొరేట్‌ కాలేజీలకు దరఖాస్తులు స్వీకరణ

ఖమ్మంసంక్షేమవిభాగం,ఆక్టోబరు2: షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించే కార్పొరేట్‌ కాలేజీల్లో చేరేందుకు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి కస్తాల సత్యనారాయణ పేర్కొన్నారు. 2020-2021  విద్యాసంవత్సరంలో నోటిఫికేషన్‌  విషయాలను శుక్రవారం విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ఆశ్రమ, కేజీబీవీ, గురుకుల, నవోదయ, కేంద్రీయ, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతిలో 7.0జీపీఏ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన విద్యార్థులు ఇందుకు అర్హులున్నారు. ఈనెల17వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేయాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులకు  20న ఖమ్మంలోని అంబేద్కర్‌ భవనంలో ధ్రువపత్రాలు పరిశీలన జరుగుతుందన్నారు.

Updated Date - 2020-10-03T11:20:18+05:30 IST