అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2020-10-13T06:25:39+05:30 IST

అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ ఆదేశించారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

కొణిజర్ల, ఏన్కూర్‌లో కలెక్టర్‌ పర్యటన


 కొణిజర్ల, అక్టోబరు12: అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ ఆదేశించారు. కలెక్టర్‌ సోమవారం మండలంలో అకస్మికంగా పర్యటించి తీగలబంజర గ్రామంలో పల్లెప్రకృతివనాలు, కంపోజ్‌షెడ్‌, వైకుంఠదామాల నిర్మాణాలను తనిఖీ చేశారు. గుబ్బగుర్తి గ్రామంలో వ్యవసాయేతర ఆస్తులకు సంబందించి జరుగుతున్న సర్వేను తనిఖీ చేశారు. యాప్‌లో సమగ్రాస్తులను సర్వేకు సంబందించి వివరాలు పకడ్భందీగా ఉండాలని, త్వరితగతిన సర్వేను అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణ, ఎంపీడీవో రమాదేవి, ఎంపీటీసీ నాగమణి, పంచాయతీ కార్యదర్శి సతీష్‌, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T06:25:39+05:30 IST