తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలి

ABN , First Publish Date - 2020-12-21T04:25:54+05:30 IST

తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటుచేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చీమ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలి
మాట్లాడుతున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చీమ శ్రీనివాసరావు

ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసరావు

ఖమ్మంచర్చికాంపౌండ్‌, డిసెంబరు 20: తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటుచేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చీమ శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కేవీ కృష్ణారావు అధ్యక్షతన ఖమ్మం నగరంలోని కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్టిస్ట్‌ భవన్‌లో  ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాసరావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది ప్రాణత్యాగాలు చేశరని పేర్కొన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా రాష్ట్రం సిద్దించిందని, అటువంటి వారి కుటుంబాల కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరంజిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కేవీ కృష్ణారావు, టీఎన్‌జీవో అధ్యక్షుడు కె.రంగరాజు, డాక్టర్‌ జేఏసీ నుంచి డాక్టర్‌ బాబురత్నాకర్‌, డోకుపర్తి సుబ్బారావు, రయిస్‌ అన్వర్‌, మంచికంటి నరేష్‌, కొండలరావు, నరేందర్‌, పాలకుర్తి కృష్ణ, రవిచంద్రచౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-21T04:25:54+05:30 IST