అమరవీర జవాన్లకు జాగారంతో ఘన నివాళి

ABN , First Publish Date - 2020-06-22T10:35:58+05:30 IST

మడుపల్లి విద్యావంతుల వేధిక సభ్యులు అమరవీరులైన జవానులకు రాత్రంత జాగారం చేసి ఘనంగా నివాళలర్పించారు.

అమరవీర జవాన్లకు జాగారంతో ఘన నివాళి

మధిర, జూన్‌ 21: మడుపల్లి విద్యావంతుల వేధిక సభ్యులు అమరవీరులైన జవానులకు రాత్రంత జాగారం చేసి ఘనంగా నివాళలర్పించారు. వేధిక సభ్యులు కంభం శివకృష్ణ ఆధ్వర్యంలో మడుపల్లిలో శనివారం రాత్రి 10గంటలకు జాగారం ప్రారంభించి ఆదివారం ఉదయం వరకు కొనసాగించారు. తొలుత కొవ్వత్తులతో ప్రదర్శన నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ కోట రాంబాబు, ఏఎంసీ వైఎ్‌సచైర్మెన్‌ శీలం వీరవెంకటరెడ్డి, కౌన్సిలర్‌లు తొగరు వరలక్ష్మీ, ఓంకార్‌, మేడికొండ కళ్యాణి,అల్లూరు ఉమామహేశ్వరరెడ్డి, రేగళ్ల సాంబశివరావు, పారుపల్లి భద్రరావు, చింతల వెంకటేశ్వర్లు, కృష్ణ, ఆంజనేయులు, మురళి, శివారెడ్డి నాగసాయి, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more