దొంగతనం కేసులో 9నెలల జైలు
ABN , First Publish Date - 2020-06-18T10:24:47+05:30 IST
దొంగతనం కేసులో నిందితుడైన అశ్వారావుపేటకు చెందిన చల్లా దశరధ్‌రాజ్‌కు స్పెషల్ మొబైల్‌కోర్టు న్యాయమూర్తి ఎం.ఉషశ్రీ 9నెలల జైలుశిక్షతో పాటు

ఖమ్మం లీగల్, జూన్17: దొంగతనం కేసులో నిందితుడైన అశ్వారావుపేటకు చెందిన చల్లా దశరధ్‌రాజ్‌కు స్పెషల్ మొబైల్‌కోర్టు న్యాయమూర్తి ఎం.ఉషశ్రీ 9నెలల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పుచెప్పారు. ఫిర్యాది పాలేరుకు చెందిన లింగయ్య ఆగస్టు 16, 2014న తన ఇంటికి తాళంవేసి పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి రాగా ఇంటి తాళం పగలకొట్టి ఉంది. ఇంట్లోని బంగారు,వెండి వస్తువులు పోయినట్లు కూసుమంచి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలుచేశారు. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి పై విధంగా తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పీపీ వి నర్సయ్య వాదించారు.