29న యూటీఎఫ్‌ జిల్లా మహాసభలు

ABN , First Publish Date - 2020-11-26T04:59:02+05:30 IST

ఈ నెల 29న జరుగనున్న 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు.

29న యూటీఎఫ్‌ జిల్లా మహాసభలు

జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు

పాల్వంచ రూరల్‌, నవంబరు 25 : ఈ నెల 29న జరుగనున్న 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు. బుధవారం పాల్వంచలోని ప్రాంతీయ కార్యాలయంలో పాల్వంచ, ములకలపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ప్రమోషన్లకు అర్హత ఉండి కూడా పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురంలో జిల్లా మహాసభలకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మల్లెంపాటి వెంకటేశ్వర్లు, కిషోర్‌సింగ్‌, రాధాకృష్ణ, శ్రీనివా్‌స, యాకూబ్‌పాషా,మంగీలాల్‌, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. 


Read more