254 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-10-04T09:29:19+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉది. ఇరు జిల్లాల్లో శనివారం 254 కొత్త కేసులు

254 పాజిటివ్‌ కేసులు

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమ విభాగం, అక్టోబర్‌ 03: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉది. ఇరు జిల్లాల్లో శనివారం 254 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లాలో 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 175 మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 2046 మందికి పరీక్షలు నిర్వహించగా 175 మందికి పాజిటివ్‌ తేలింది. కొత్తగూడెం డివిజన్‌లో 99, భద్రాచలం డివిజన్‌లో 76 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

 

Updated Date - 2020-10-04T09:29:19+05:30 IST