కరోనా బారిన 189మంది

ABN , First Publish Date - 2020-09-14T10:17:30+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఇరుజిల్లాల్లో 189మంది

కరోనా బారిన 189మంది

ఖమ్మం జిల్లాలో 105, భద్రాద్రిలో 84కేసులు 


కొత్తగూడెం కలెక్టరేట్‌/ ఖమ్మం సంక్షేమవిభాగం, సెప్టెంబరు 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఇరుజిల్లాల్లో 189మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 105, భద్రాద్రి జిల్లాలో 84మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఖమ్మం జిల్లా స్థాయిలో కొవిడ్‌ హెల్త్‌ బులిటెన్‌ ఇవ్వకపోతుండటంతో వివరాల్లో స్పష్టత రావడం లేదు. ఆదివారం 105మందికి పాజిటివ్‌ వచ్చినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెంలో ఆదివారం మొత్తం 637 మందికి పరీక్షలు నిర్వహిస్తే 84 పాజిటివ్‌ వచ్చాయని జిల్లా వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగూడెం డివిజన్‌లో 56, భద్రాచలం డివిజన్‌లో 28మంది కరోనా బారినపడ్డారు. 

Updated Date - 2020-09-14T10:17:30+05:30 IST