జిల్లాలో ఘనంగా యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2020-06-22T10:44:42+05:30 IST

జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యంలో యోగాసనాలు

జిల్లాలో ఘనంగా యోగా దినోత్సవం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, జూన్‌ 21: జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి, ధ్యానం చేస్తూ యోగా ప్రాశస్త్యాన్ని చాటారు. అంబేద్కర్‌ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరు క్రాంతి, పారిశుధ్య సిబ్బంది పాల్గొని యోగసనాలు వేశారు.


ఈ సందర్భంగా మేయర్‌, కమిషనర్‌ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. క్రీడాశాఖలో యోగాసనాలను ప్రదర్శించారు. డీవైఎస్‌వో కీర్తి రాజవీరు పాల్గొని యోగా ప్రత్యేకతను, లాభాలను వివరించారు. మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత కడారు అనంతరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని యోగాసనాలు వేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - 2020-06-22T10:44:42+05:30 IST