బతుకమ్మ చీరల యారన్‌ సబ్సిడీని వారంలో చెల్లించాలి

ABN , First Publish Date - 2020-11-19T06:38:34+05:30 IST

సిరిసిల్లలో 2018లో తయా రు చేసిన బతుకమ్మ చీరలకు రా వాల్సిన 10 శాతం యారన్‌ సబ్సి డీని వారం రోజుల్లో అందించాల ని లేకుంటే చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేస్తామని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ ప్రకటించారు.

బతుకమ్మ చీరల యారన్‌ సబ్సిడీని వారంలో చెల్లించాలి
నినాదాలు చేస్తున్న పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు

- తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌

సిరిసిల్ల రూరల్‌, నవంబరు 18: సిరిసిల్లలో 2018లో తయా రు చేసిన బతుకమ్మ చీరలకు రా వాల్సిన 10 శాతం యారన్‌ సబ్సి డీని వారం రోజుల్లో అందించాల ని లేకుంటే చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేస్తామని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ ప్రకటించారు. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌లో బుధ వారం సీఐటీయూ అధ్వర్యంలో తెలంగాణ పవర్‌టూం వర్కర్స్‌ యూనియన్‌ సమావేశంలో రమేష్‌ మాట్లాడు తూ 10 శాతం యారన్‌ సబ్సీడీని రాష్ట్ర ప్రభుత్వం విడు దల చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు 700 మంది కార్మికులకు మాత్రమే సబ్సిడీని అం దించారన్నారు. ఇంకా మూడువేల మంది కార్మికులకు రావాల్సి ఉందన్నారు. అధికారులు వారం రోజుల్లో సబ్సి డీని అందించకుంటే నిరాహార దీక్ష చేస్తామన్నారు. అలా గే పాలిస్టర్‌, కాటన్‌ కార్మికుల కూలీ అగ్రిమెంట్‌ గడువు ఎనిమిది నెలల క్రితం ముగిసిపోయిందన్నారు. కూలీ పెంచాలంటూ యాజమానులకు కూలీ పెంచాలంటూ నోటీసులు అందించినా యాజమానులు కూలీ పెంచేం దుకు ముందుకు రావడం లేదన్నారు. కూలి పెంపు కోసం కార్మికులు, ఆసాములు ఐక్యంగా దశలవారీగా పోరాటలు నిర్వహిస్తూ మంత్రి కేటీఅర్‌ దృష్టికి తీసుకెళ్లి యాజమానులపై ఒత్తిడి తేవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, నాయకులు గుండు రమేష్‌, గడ్డం ఎల్లయ్య, భీమనాతిని రమేష్‌, సబ్బని శ్రీకాంత్‌, బూర్ల రవీందర్‌, తౌటు సత్యనారా యణ, నక్క రాములు, మేర్గు వెంకటేశం, కట్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-19T06:38:34+05:30 IST