మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

ABN , First Publish Date - 2020-12-12T04:52:20+05:30 IST

స్వశక్తి మహిళలు స్వతహాగా ఆర్థి క స్వావలంబన సాధించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రె డ్డి అన్నారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
ఫుడ్‌ ప్రాసిసెంగ్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 

ఓదెల, డిసెంబరు 11: స్వశక్తి మహిళలు స్వతహాగా ఆర్థి క స్వావలంబన సాధించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రె డ్డి అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్‌ కార్యాలయంలో రూ.4 లక్షల మేరకు మండల సమాఖ్య నిధులతో ఏర్పాటు చేసిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు గ్రా మీణ ప్రాంతాల్లో మండల సమాఖ్యల ద్వారా నాణ్యమైన గో ధుమపిండి, పసుపు, కారంపొడి తయారీ యూనిట్లను ఏ ర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే నాణ్యమైన పిండి, పసుపు ద్వారా ప్రజలకు ఆరోగ్యం, మహిళలకు ఆదా యం సమకూరుతుందని తెలిపారు. ఇలాంటి యూనిట్ల ద్వారా మహిళ గ్రూపులు ఆర్థికంగా మంచి ఆదాయం సమ కూరడంతో ఆదర్శంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, సర్పంచ్‌ల ఫో రం మండల అధ్యక్షులు ఆళ్ల రాజిరెడ్డి, సింగిల్‌ ఇండో చైర్మ న్‌ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కుమార్‌గౌడ్‌, నాయకు లు పత్తి సమ్మిరెడ్డి, సతీష్‌, బోడకుంట స్వామి, ఆరెల్లి మొం డయ్య, ఐకేపీ ఏపీఎం లత మంగేశ్వరి, మల్లాఖార్జు మండ ల సమాఖ్య నిర్వాహకులు, సీసీలు శ్రీనివాస్‌, మల్లయ్య, కొమురయ్య, విజయ, భవాని, వీవోఏలు సర్పంచ్‌లు ఎంపీ టీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:52:20+05:30 IST