-
-
Home » Telangana » Karimnagar » Woman suicides including children
-
పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-24T11:42:15+05:30 IST
శంకరపట్నం మండలంలోని కరీంపేటకు చెందిన గడ్డం రమ్య (25) అనే వివాహిత, తన కొడుకు శివమణి (5), కూతురు అమ్ములు(2)తో కలిసి ప్రధాన కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

శంకరపట్నం/హుజూరాబాద్ రూరల్ మార్చి 23: శంకరపట్నం మండలంలోని కరీంపేటకు చెందిన గడ్డం రమ్య (25) అనే వివాహిత, తన కొడుకు శివమణి (5), కూతురు అమ్ములు(2)తో కలిసి ప్రధాన కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రమ్య మృతదేహాన్ని హుజూరాబాద్ శివారులో అమ్ములు మృతదేహాన్ని సింగాపూర్ శివారులో కుటుంబ సభ్యులు గుర్తించారు. శివమణి అచూకీ లభించకపోవడంతో ప్రధాన కాకతీయ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు.
ఆత్మ హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసు లు అనుమానిస్తున్నారు. రమ్య మండలంలోని ఇప్పలపల్లి నివాసి కాగా ఎనిమిది సంవత్సరాల క్రితం కరీంపేటకు చెందిన గడ్డం రాజుతో వివాహం జరిగింది. మృతిరాలి తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారు. సోదరుడు చిన్నవాడు కావడంతో రమ్య పరిస్థితి జీవన విధానం కష్టతరంగానే కొనసాగిందని గ్రామస్థులు తెలిపారు. రమ్య ఇద్దరి పిల్లలతో కలిసి కాలువలో దూకి ఆత్మ హత్య చేసుకోవడంపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.