నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం మౌనం ఎందుకు

ABN , First Publish Date - 2020-12-30T04:38:21+05:30 IST

రాష్ట్రంలో నిరుద్యోగులు పి ట్టల్లా రాలిపోతుంటే సీఎం కేసీ ఆర్‌ మౌనం ఎందుకు వహిస్తున్నారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఈర్తి మధుకర్‌ ప్రశ్నించారు.

నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం మౌనం ఎందుకు
పోలీసులతో వాగ్వాదానికి దిగిన నాయకులు

బీజేవైయం జిల్లా అధ్యక్షుడు ఈర్తి మధుకర్‌ 

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 29: రాష్ట్రంలో నిరుద్యోగులు పి ట్టల్లా రాలిపోతుంటే సీఎం కేసీ ఆర్‌ మౌనం ఎందుకు వహిస్తున్నారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఈర్తి మధుకర్‌ ప్రశ్నించారు. మంగళవారం బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని స్థానిక మంచినీళ్ల బావి సమీపంలో నిజామాబాద్‌-జగిత్యాల జాతీయ ర హదారిపై ధర్నా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడిచినా నేటికీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన విధంగా నిరుద్యో గ భృతి అందించాలని డిమాండ్‌ చేశారు. బీజేవైఎం నాయకుల ను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేవైఎం నాయకులు జగదీష్‌, నవీన్‌, చందు, రాజేంధర్‌రెడ్డి, రవితే జ, ప్రేమ్‌ సాగర్‌, రాజేష్‌, ఉమేష్‌, మధు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T04:38:21+05:30 IST