పేదలకు ఊరట

ABN , First Publish Date - 2020-04-28T10:34:28+05:30 IST

లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ ఊరటనిస్తోంది

పేదలకు ఊరట

మే నెల కోటాలో బియ్యంతోపాటు కిలో కందిపప్పు ఉచితం

అంత్యోదయ కార్డుదారులకు రాయితీపై చక్కెర 

సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ పరిధిలో రాయితీపై గోధుమలు 

జిల్లాలో రేషన్‌ కార్డులు 173002 లబ్ధిదారులు 504453 మంది

బియ్యం 6025946 కిలోలు.. కందిపప్పు173002 కిలోలు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) : లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ ఊరటనిస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ప్రధానంగా బలహీన వర్గా ల ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభు త్వం ఉచితంగా రేషన్‌, రూ.1500 చొప్పున నగదు అందజేసి ఆదుకుం టోంది. ఏప్రిల్‌లో ఉచితంగా బియ్యం, నగదు అందజేసిన ప్రభుత్వం మే లో బియ్యంతోపాటు కిలో కంది పప్పును కూడా ఇవ్వనుంది. ఏప్రిల్‌లో ఆహారభద్రత కార్డులు ఉన్న ఒక్కో కుటుంబానికి రూ.1500 నగదు, కు టుంబంలో ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసింది. ఈ సారి వారికి కిలో కందిపప్పు కూడా ఇవ్వనుంది.


మరోవైపు అంత్యోదయ కార్డుదారులకు రాయితీపై కిలో చక్కెర అందించనుంది. పట్టణాల్లో రా యితీపై గోధుమలు ఇవ్వనుంది. వీటితోపాటు కార్డుదారులందరికీ రాయితీపై ఉప్పును ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. మే 1 నుంచి సరుకుల పంపిణీ ప్రారంభించనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 344 రేషన్‌ దుకా ణాలు ఉన్నాయి. వాటి పరిధిలో 1,73,002 కార్డులకు 5,04,453 మంది లబ్ధిదారులు ఉన్నారు. 13,613 అంత్యోదయ కార్డులకు 35,547 మంది,  1,59,157 ఆహార భద్రత కార్డులకు 4,68,670 మంది, 232 అన్నపూర్ణ కార్డులకు 236 మంది లబ్ధిదారులు ఉన్నారు.  


60,25,946 కిలోల బియ్యం, 1,73,002 కిలోల కందిపప్పు

జిల్లాలోని 5,04,453 మంది లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున బియ్యం, కార్డుకు కిలో చొప్పున కందిపప్పు అందించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాకు 60,25,946 కిలోల బియ్యం, 1,73,002 కిలోల కందిపప్పు కేటా యించారు. మార్కెట్‌లో కిలో రూ.100 ఉన్న కందిపప్పును ఉచితంగా ఇవ్వనున్నారు. మార్కెట్‌లో ఉప్పు కిలో రూ.10నుంచి రూ.17 వరకు ఉం డగా కార్డు దారులకు కిలో రూ.5 చొప్పున అందించనున్నారు. 


జిల్లాలోని అంత్యోదయ కార్డుదారులకు రాయితీపై రూ.13.50కు కిలో చక్కెర ఇవ్వ నున్నారు.  బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.38 వరకు ఉంది.  రాయితీ గోధుమలు మాత్రం జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకే పరిమితం చేశారు. గోధుమలు మార్కెట్‌లో రూ.36 వరకు ఉండగా రాయితీపై కిలో రూ.7చొప్పున 40,467 కిలోలను పంపిణీ చేయనున్నారు.  


Updated Date - 2020-04-28T10:34:28+05:30 IST