అందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2020-12-20T05:42:39+05:30 IST
ప్రతీ ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్‌లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ కానుకలను అందజేశారు.

- జడ్పీ చైర్ పర్సన్ అరుణ
వేములవాడ, డిసెంబరు 19 : ప్రతీ ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్‌లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు వజ్రమ్మ, బండ మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మాండ్లు, జడ్పీటీసీ సభ్యురాలు ఏశ వాణి, తహసీల్దారుల మునీందర్, నక్క శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
బలహీనవర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం
ఇల్లంతకుంట: బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం క్రైస్తవులకు కానుకలను పంపిణీ చేశారు. పండుగపూట నిరుపేదలు ఇబ్బంది పడవద్దని బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్‌కు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తొలుత ముస్కానిపేట, సిరికొండ గ్రామాల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. జడ్పీవైస్ చైర్మన్ సిద్దం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, సెస్‌డైరెక్టర్ గుడిసె అయిలయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనాథ్‌గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మిబాలరాజు, ఎంపీటీసీలు ఒగ్గు నర్సయ్యయాదవ్, పుష్పలత, తహసీల్దార్ రాజిరెడ్డి, ఎంపీడీవో విజయ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, కోఆప్షన్ సభ్యుడు సలీం, ఏఎమ్‌సీ డైరెక్టర్ అనీల్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
మండల కేంద్రంలోని హెచ్‌పీ ఫిల్లింగ్‌స్టేషన్‌లో నిర్వహించిన లక్కీడ్రాలో విజేతలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బహుమతులను అందజేశారు. ఫిల్లింగ్‌స్టేషన్ యజమాని నలుమాచు శ్రీనివాస్, నాయకులు అనీల్‌కుమార్, బాలరాజు, ఉడుతల వెంకన్న, అంతగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చందుర్తి: రాష్ట్ర ప్రభ్వుతం క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఎంపీపీ బైరగోని లావణ్య అన్నారు. క్రిస్మస్ సందర్భంగా శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చేశారు. జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీవో రవీందర్, వైస్ ఎంపీపీ అబ్రహం, కో ఆప్షన్ సభ్యులు కమలాకర్ పాల్గొన్నారు.