విలీన గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం: మేయర్
ABN , First Publish Date - 2020-11-03T10:51:34+05:30 IST
నగర పాలకసంస్థలో విలీనమైన గ్రామాల్లోని డివిజన్లలో నెలకొన్న సమస్యలను త్వర లోనే పరిష్కరిస్తామని మేయర్ యాద గిరి సునీల్‌రావు తెలిపారు
కరీంనగర్ టౌన్, నవంబరు 2: నగర పాలకసంస్థలో విలీనమైన గ్రామాల్లోని డివిజన్లలో నెలకొన్న సమస్యలను త్వర లోనే పరిష్కరిస్తామని మేయర్ యాద గిరి సునీల్‌రావు తెలిపారు. ‘విలీనగ్రామా లపై శీతకన్ను’ అనే శీర్షికన కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో సమస్యలను పరి ష్కరించడం లేదంటూ ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి మేయర్ స్పందించి తీగల గుట్టపల్లి చంద్రపురికాలనీలో సోమ వారం కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్‌తో కలిసి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అంతర్గత రోడ్లను విస్తరించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్నిరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ప్రతిపాద నలను తయారుచేశామని ఈనెలలో వాటికి టెండర్లను నిర్వహించి వచ్చే నెలలోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. వీధిదీపాలను ఏర్పా టుచేస్తామని, మంచి నీటిసౌకర్యం కల్పిస్తామని, దశల వారిగా విలీన గ్రామాల్లో అభివృద్ధిపనులను పూర్తి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు.
ఉద్యోగుల సేవలు మరువలేనివి..
మున్సిపల్ కార్యాలయంలో వివిధ హోదాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేని వని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. సోమవారం పదవీ విరమణ చేసిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులను మేయర్ వై.సునీల్‌రావు, కమిషనర్ వల్లూరి క్రాంతి ఘనంగా సన్మానించి పదవీ విరమణ వీడ్కోలు చెప్పారు.