అడ్డంకులెదురైనా చలో అసెంబ్లీ నిర్వహిస్తాం

ABN , First Publish Date - 2020-03-12T11:32:12+05:30 IST

పీఆర్సీ అమలుతోపాటు, సీపీఎస్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 13న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డంకులెన్ని ఎదురైనా నిర్వహించి తీరుతామని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోహెడ చంద్రమౌళి అన్నారు.

అడ్డంకులెదురైనా చలో అసెంబ్లీ నిర్వహిస్తాం

డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోహెడ చంద్రమౌళి


మానకొండూర్‌, మార్చి11 : పీఆర్సీ అమలుతోపాటు, సీపీఎస్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 13న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డంకులెన్ని ఎదురైనా నిర్వహించి తీరుతామని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోహెడ చంద్రమౌళి అన్నారు. మానకొండూర్‌లో ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుదవారం చలో అసెంబ్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గతంలో ఉపాద్యాయ, ఉద్యోగులకు అనేక హమీలు ఇచ్చినప్పటికి అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి లేదని ప్రభుత్వం అనడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బండపెల్లి పర్శరాములు, సత్యనారాయణరెడ్డి, ఎన్‌ శ్రీనివాస్‌, జి రామన్న, ఇ అమరేందర్‌రెడ్డి, డి మల్లయ్య, బి రమేశ్‌, జి రవీందర్‌, ఎం కొమురయ్య, సిహెచ్‌ సాయిలు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-12T11:32:12+05:30 IST