ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమష్టిగా పోరాడుతాం

ABN , First Publish Date - 2020-03-21T11:40:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విఽదానాలను వ్యతిరేకిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో సమష్టిగా పోరాడుతామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమష్టిగా పోరాడుతాం

రేవంత్‌రెడ్డి అరెస్టును పార్టీపరంగా ఖండించాం 

టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు


మంథని, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విఽదానాలను వ్యతిరేకిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో సమష్టిగా పోరాడుతామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అరెస్టును లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీసుకెళ్లారన్నారు. ఈ అరెస్టు విషయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంగా ప్రభుత్వ చర్యను ఖండించారన్నారు. రేవంత్‌రెడ్డి అక్రమ అరెస్టును సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరం కాంగ్రెస్‌ పార్టీ తరపున ఖండించామన్నారు. జైలుకు వెళ్ళి పరామర్శించామన్నారు.


ఈ అంశంపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తకు, నాయకుడికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా పార్టీ స్పందిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విఽదానాలను ఖండిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అంతా ఒకే కుటుంబంలా సమష్టిగా ముందుకెళ్తున్నామన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని గట్టిగా డిమాండ్‌ చేశారన్నారు. ఖాజిపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావించారన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు పెండ్రు రమా, చొప్పకట్ల హన్ముంతు, కాంగ్రెస్‌ నేతలు శశిభూషణ్‌కాచే, సెగ్గెం రాజేష్‌, తోట్ల తిరుపతియాదవ్‌, నూకల బానయ్య, ఇనుముల సతీష్‌, బొబ్బలి శ్రీధర్‌, రాము, ప్రవీణ్‌, కిరణ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-21T11:40:33+05:30 IST