-
-
Home » Telangana » Karimnagar » We will address public issues soon
-
ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం: మేయర్
ABN , First Publish Date - 2020-06-23T10:12:54+05:30 IST
డివిజన్లలో ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా సత్వరమే పరిష్కరిస్తామని నగర మేయర్ వై సునీల్‌రావు అన్నారు.

కరీంనగర్ టౌన్, జూన్ 22: డివిజన్లలో ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా సత్వరమే పరిష్కరిస్తామని నగర మేయర్ వై సునీల్‌రావు అన్నారు. నాల్గవరోజు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా సోమవారం 42వ డివిజన్‌లో పర్యటించారు. కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్‌రావుతో కలిసి డివిజన్‌లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్మశాన వాటికను సందర్శించారు. డివిజన్‌లోని డ్రెయినేజీలలో ఉన్న సిల్ట్‌ను అప్పటికప్పుడే తీసివేయించారు. దోమల నివారణకు ఫాగింగ్, స్ర్పే చేయించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేటర్ తమ దృష్టికి తెచ్చిన సమస్యలను వారం రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.