రాహుల్ నాయకత్వాన్నే కోరుకుంటున్నాం
ABN , First Publish Date - 2020-12-21T05:28:25+05:30 IST
ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నాయకత్వాన్నే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కోరుకుంటోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు వెల్లడించారు.

- టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు
మంథని, డిసెంబర్ 20: ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నాయకత్వాన్నే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కోరుకుంటోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడు తూ.. రాహుల్ నాయకత్వంలోనే వచ్చే పార్లమెంట్, ఆసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తూ పార్టీలో జాతీయ స్థాయిలో ముఖ్యులు, సీనియర్లు, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కోరుకుంటూ ఈ విషయాన్ని పార్టీ అధిష్టానికి తెలియజేశారన్నారు. దేశ వ్యాప్తంగా ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే, కేంద్రంలోని మోడీ ప్రజా వ్యతిరేక విధనాలను ఎండగట్టే సత్తా రాహుల్ గాంధీకే ఉందన్నారు. జీఎస్టీతో సహా కేంద్రంలో ఇటీవల మతతత్వ బీజేపీ తీసుకువచ్చిన బిల్లులకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ సహకరిస్తుందన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విఽదాలను సీఎం కేసీఆర్ ఖండించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాహుల్ నాయకత్వంలో పని చేస్తామన్నారు.
చెక్కులు పంపిణీ చేసిన శ్రీధర్‌బాబు..
డివిజన్‌లోని మంథని, ముత్తారుం మండలాలకు చెంది న 81 మందికి రూ. 75 లక్షల విలువ చేసే సీఎంఆర్‌ఎస్, కళ్యాణ లక్ష్మి చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు శశిభూషణ్‌కాచే, సెగ్గెం రాజేచే పెండ్రు రమాదేవి-సురేష్‌రెడ్డి, చొప్పకట్ల హ న్ముంతు, జంజర్ల శేఖర్, పోలు శివ, పేరవేన లింగయ్యయాదవ్, అజీంలు పాల్గొన్నారు.