కరోనా కట్టడికి..వేపచెట్టుకు నీళ్ల పూజ

ABN , First Publish Date - 2020-03-24T11:36:18+05:30 IST

కరోనాతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఏం జరుగుతుందోననే భయంలో ఉన్నారు.

కరోనా కట్టడికి..వేపచెట్టుకు నీళ్ల పూజ

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా హడావుడి


సిరిసిల్ల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనాతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఏం జరుగుతుందోననే భయంలో ఉన్నారు. సోమ వారం రాత్రి వేప చెట్టుకు నీళ్లతో పూజలు చేస్తే కరోనా పోతుందని వదంతులు వ్యాపించాయి. జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల్లో మహి ళ లు వేపచెట్టుకు ఐదు బావుల నుంచి నీళ్లు తీసు కొచ్చి పూజలు చేశారు. దీంతో గ్రామాల్లో ఇళ్ల లో ఉండాల్సిన వారు బయటకు రావడంతో హడా వుడి నెల కొంది. పోలీసులు వారికి నచ్చజెప్పి వారిని ఇళ్లలోకి పంపించారు. 

Read more