వినాయక మండపాలకు అనుమతి లేదు
ABN , First Publish Date - 2020-08-12T10:25:06+05:30 IST
కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న విపత్కర పరిస్థి తుల్లో వినాయక నవరాత్రుల కోసం మండపాల ఏర్పాటును

జిల్లా అదనపు ఎస్పీ దక్షిణా మూర్తి
జగిత్యాల టౌన్, ఆగస్టు 11 : కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న విపత్కర పరిస్థి తుల్లో వినాయక నవరాత్రుల కోసం మండపాల ఏర్పాటును అనుమతించడం లేదని జిల్లా అదనపు ఎస్పీ దక్షిణా మూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో మంగళవారం గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు, హిందూ మత పెద్దలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగా ఇళ్లలోనే జరుపుకోవాలన్నారు. వినాయక ప్రతిమల తయారీదారులు, మం డపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలన్నారు. మూడు ఫీట్లు కంటే ఎక్కువ ఉత్తు ఉన్న గణే ష్ ప్రతిమలకు అనుమతి లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నవరాత్రుల నిర్వాహణకు పోలీస్ శాఖ నుంచి అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు సూచనలు, నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ వెంకట రమణ, సీఐ జయేష్ రెడ్డి పాల్గొన్నారు.