పారిశుధ్య పనులకు ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2020-03-02T11:31:27+05:30 IST

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపాలిటీ ల్లో పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇ వ్వాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ సూ చించారు.

పారిశుధ్య పనులకు ప్రాధాన్యమివ్వాలి

 ‘పట్టణ ప్రగతి’లో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ


సుల్తానాబాద్‌, మార్చి 1: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపాలిటీ ల్లో పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇ వ్వాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ సూ చించారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని 4, 15 వార్డుల్లో ఆయన ఆదివారం ప్రగతి పనులను పరిశీలించారు. పట్టణంలో తడి, పొడి చెత్త నిర్వహణ పట్ల పకడ్బందీ చర్యలు తీసుకోవా లని, ఈ విషయంలో ప్రజలను చైతన్యవం తం చేసి రెండు చెత్తలను వేర్వేరుగా ఉంచే లా చూడాలని సూచించారు. ప్రతి ఇంటికి రెండు బుట్టలను పంపిణీ చేయాలని అన్నా రు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకోవాల ని, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనులు చేపట్టాలని సూచించారు. పట్టణ సుందరీకర ణలో భాగంగా అభివృద్ధి పనులకు సంబం ధించిన కార్యాచరణను రూపొందించుకొని వా టిని అమలు చేయాలని అన్నారు.


గత ఐదు రోజులుగా ప్రగతి పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయని, అనేక దీర్ఘకాలిక సమస్య లు ఈ కార్యక్రమంలో పరిష్కరించబడుతు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, వైస్‌చైర్మన్‌ బిరుదు సమత కృష్ణ, ముత్యం రమేష్‌ పాల్గొన్నారు. చైర్మన్‌ ముత్యం సునితతోపాటు పలువురు కౌన్సిల ర్లు, అధికార బృందం ఆర్టీసీ బస్టాండ్‌లోని ప రిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాలలో పాల్గొన్నారు. బస్టాండ్‌ స్థలంలో పెద్దఎత్తున నిల్వ చేసిన చెత్తను తొలగించారు.

Updated Date - 2020-03-02T11:31:27+05:30 IST