భర్తను నమ్మించేందుకు అక్కాచెల్లెళ్ల మాస్టర్ ప్లాన్.. పోలీసుల ఎంట్రీతో బయటపడిన బండారం..!
ABN , First Publish Date - 2020-06-18T17:10:18+05:30 IST
భర్తకు తెలియకుండా బంగారం కాజేసేందుకు అక్కతో కలిసి దోపిడీ జరిగిందంటూ కట్టుకథ అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఒక మహిళ. బుధవారం ఆమెపై కేసు నమోదు చేసి
బంగారం కాజేసేందుకు చోరీ డ్రామా : మహిళ అరెస్ట్
కోల్‌సిటీ/కరీంనగర్(ఆంధ్రజ్యోతి): భర్తకు తెలియకుండా బంగారం కాజేసేందుకు అక్కతో కలిసి దోపిడీ జరిగిందంటూ కట్టుకథ అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఒక మహిళ. బుధవారం ఆమెపై కేసు నమోదు చేసి గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేష్‌న గర్‌లో రేషన్ డీలర్ సిరిపురం రాజు కుటుంబం నివాసముంటుంది. అతని భార్య సిరిపురం లావణ్య అలియాస్ గందె పద్మ తన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తి చొరబడి కత్తితో బెదిరించి 15తులాల బంగారం అపహరించాడని పేర్కొంది. అనుమానం రాకుండా ఆమె భర్త రాజుతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. వన్‌టౌన్ సీఐ పర్స రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను విచారించి సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఆమె చెప్పిన సమయంలో అనుమానితులు, కొత్తవారు సంచరించలేదని ధ్రువీకరించుకున్నారు. కుటుంబ సభ్యులను విచారించడంతో ఇంట్లో చోరీనే జరుగలేదని, లావణ్యనే ఇంట్లోని బంగారాన్ని భర్తకు తె లియకుండా లాకర్‌లోని నుంచి బయటకు తీసినట్టు నిర్ధారణ అయ్యింది. ఆమె భర్త వద్ద ఉన్న బీరువా తాళాలను తీసుకుని బంగారు ఆభరణాలను బసంత్‌నగర్‌లోని తన సోదరి పాత రేణుకకు అప్పగించినట్టు తెలిపారు. అనంతరం ఈనెల 8వ తేదిన తన భర్త రాజు రేషన్ షాపునకు వెళ్లిన సమయంలో దోపిడీ జరిగినట్టు కట్టుకథ అల్లింది. పోలీసు విచారణలో అసలు బయటపడింది. అక్కాచెల్లెళ్లే కలిసి కట్టుకథ అల్లినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. సిరిపురం లావణ్యను అరెస్టు చేశారు.