కరోనాతో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-11-28T05:20:12+05:30 IST

నగరంలో శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతిచెందారు.

కరోనాతో ఇద్దరు మృతి

 మరో 64 మందికి పాజిటివ్‌ 

కరీంనగర్‌, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగరంలో శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతిచెందారు. కశ్మీరుగడ్డకు చెందిన 84సంవత్సరాల వృద్ధురాలు, చిగురుమామిడి మండ లంలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన 70ఏళ్ల వృద్ధుడు కొవిడ్‌ బారిన పడి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు. అలాగే మరో 64మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిసింది. కరీంనగర్‌ అర్బన్‌తో కలిసి మొత్తం 16మండలాలుండగా వాటిలో ఆరు మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. కరీంనగర్‌ పట్టణంలో 36మంది కొవిడ్‌ బారినపడగా మరో 28మంది మిగిలిన మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సైదాపూర్‌ మండలంలో ఒకరికి, చొప్పదండి మండలంలో నలుగురికి, చిగురుమామిడి మండలంలో ఒకరికి,  రామడుగు మండలంలో నలుగురికి, వీణవంక మండలంలో ఎనిమిది మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. శంకరపట్నం మండలంలో ముగ్గురు, గంగాధర మండలంలో ఇద్దరు, జమ్మికుంటలో ముగ్గురు, కరీంనగర్‌ పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో ఒకరు, లక్ష్మీనగర్‌లో ఒకరు, బోయవాడలో ఒకరు, సుభాష్‌నగర్‌లో ఇద్దరు, సప్తగిరికాలనీ పరిసరాల్లో ఎనిమిది మంది, కోతిరాంపూర్‌లో ముగ్గురు, విద్యానగర్‌లో ముగ్గురు కరోనా వ్యాధిబారినపడ్డారు. వీరితోపాటు పలువురు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సీటీస్కాన్‌, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకొని హోం ఐసోలేషన్‌, హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు తెలిసింది.

Read more