ముగిసిన టీఎస్‌ ఎడ్‌సెట్‌

ABN , First Publish Date - 2020-10-04T10:04:00+05:30 IST

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం ప్రారంభమైన ఎడ్‌సెట్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శనివారం ప్రశాంతంగా ముగిసాయి.

ముగిసిన టీఎస్‌ ఎడ్‌సెట్‌

1,837 మందికి 1,447 మంది విద్యార్థులు హాజరు


తిమ్మాపూర్‌, అక్టోబరు 3: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం  ప్రారంభమైన ఎడ్‌సెట్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శనివారం ప్రశాంతంగా ముగిసాయి.  ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్‌లలో పరీక్ష నిర్వహించారు. మండలంలోని టీసీఎస్‌ ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌, వాగేశ్వరి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, శ్రీ చైతన్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే విద్యార్ధులను లోనికి అనుమతించారు. రెండు సెషన్‌లలో కలిసి 1,837 మందికి 1,447 మంది హాజరు కాగా 390 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించారు.

Updated Date - 2020-10-04T10:04:00+05:30 IST