రామగుండాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి
ABN , First Publish Date - 2020-12-04T05:07:38+05:30 IST
రామగుండాన్ని మోడల్ సిటీ గా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చం దర్ చెప్పారు.

- రూ.2.76కోట్లతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే భూమిపూజ
గోదావరిఖని, డిసెంబరు 3: రామగుండాన్ని మోడల్ సిటీ గా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చం దర్ చెప్పారు. గురువారం రామగుండం కార్పొరేషన్ పరిధి లో 21వ డివిజన్‌లో రూ.2.76కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను రామగుండం మేయ ర్ బంగి అనీల్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపని చేశారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ రామగుండంలో మురుగు నీటితో ఈ ప్రాంత ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారని తన దృ ష్టికి రావడంతో ఈ ప్రాంతంలో మురుగు నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పా టు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాల అభివృద్ధికి ప్రత్యే క దృష్టి పెట్టారని, ప్రతి ఏటా రూ. 100కోట్ల నిధులు కార్పొరేషన్ అభి వృద్ధికి కేటాయిస్తున్నారని చెప్పా రు. రామగుండం పట్టణంలో బీ పవర్‌హౌస్ మూసివేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుని మరో ఐదు సంవత్సరాల పాటు న డిచే విధంగా కృషి చేసినట్టు, రా మగుండానికి పూర్వవైభవం తీసు కువచ్చేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు. అంతర్గాం మండలంలో ఇండస్ర్టియల్ పార్కు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత కూడా ఉపాధి మార్గం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు అమీనా ఫాతిమా, కన్నూరి సతీష్ కుమార్, జెడ్‌పీటీసీ ఆముల నారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, గౌస్‌పాషా, ప్రసన్న, శ్రీని వాస్, నరేష్ పాల్గొన్నారు.