ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం

ABN , First Publish Date - 2020-02-16T09:42:08+05:30 IST

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం

  • మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో, జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌దే విజయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్‌, దుర్శేడ్‌ సొసైటీ ల్లో మొత్తం 26 డైరెక్టర్‌ పదవుల్లో 25 స్థానాలతో రెండు సొసైటీలను కైవసం చేసుకున్నామని చెప్పా రు. కరీంనగర్‌ సొసైటీలో ఏడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యార న్నారు. ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగగా ఐదు స్థానాలను గెలుచుకున్నామన్నారు. దుర్శేడ్‌ సొసైటీ లో ఏడు ఏకగ్రీవం కాగా ఆరు డైరెక్టర్‌ స్థానాల ఎన్నికల్లో ఆరింటికి ఆరు టీఆర్‌ఎస్‌ బలపరిచిన వారే  గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పార్టీపై ప్రజలకున్న నమ్మకంతోనే ఓట్లు వేస్తున్నారని చెప్పారు. తమను ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉండి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. సమావేశంలో నగర మే యర్‌ యాదగిరి సునీల్‌రావు, జడ్పీటీసీ పురమల్ల లలిత, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, నాయకులు చల్ల హరిశంకర్‌, పురమల్ల శ్రీనివాస్‌, పిట్టల రవీందర్‌, పిల్లి మహేశ్‌, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. 


రేపు వైభవంగా సీఎం జన్మదినం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఈనెల 17న వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో మేయర్‌ వై సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గతంలోలాగా కేక్‌ కటింగ్‌ లు, టపాసులు పేల్చడం వంటివి కాకుండా  మొక్క లు నాటాలని మంత్రి కేటీఆర్‌ పిలుపు ఇచ్చారన్నారు. ఆయన పిలుపు మేరకు పార్టీశ్రేణులతోపాటు అభి మానులంతా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.  సీఎం కేసీఆర్‌ లక్కీ నెంబర్‌ ఆరు అని, ఆయన 66వ జన్మదినాన్ని జరుపుకుంటున్నం దున కరీంనగర్‌లో 6,666 మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐటీ టవర్‌ ఆవరణతో పాటు జర్నలిస్టు కాలనీ వరకు వెయ్యి, సర్కస్‌గ్రౌండ్‌ పార్కులో వెయ్యి, రోడ్డు డివైడర్ల మధ్య 4,900, పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో 400, ఇతర చోట్ల కలిపి 6,666 మొక్కలు నాటుతామని వివరించారు.  కరీంనగర్‌ను హరితంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. 


18న కేటీఆర్‌ చేతుల మీదుగా ఐటీ టవర్‌ ప్రారంభం

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీరామారావు చేతుల మీదుగా ఈ నెల 18న కరీంనగర్‌ ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామని మంత్రి గంగుల కమలా కర్‌ తెలిపారు. 18న ఉదయం తొమ్మిది గంటలకు మంత్రి కేటీఆర్‌ హెలీక్యాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి బయలుదేరి కలెక్టరేట్‌ హెల్యీప్యాడ్‌కు చేరుకుంటార ని తెలిపారు. అక్కడి నుంచి ఐటీ టవర్‌కు చేరుకొని ప్రారంభిస్తారన్నరు. అనంతరం ఐటీ టవర్‌లో ప్రారంభించిన కంపెనీలు, ఉద్యోగాల నియామకం, ఇత ర అంశాలపై మీడియాతో మాట్లాడుతారని చెప్పా రు.


తర్వాత కలెక్టరేట్‌కు చేరుకొని జిల్లాకుచెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారు లు, మున్సిపల్‌ కమిషనర్లు, మేయర్‌, డిప్యూటీ మే యర్‌, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు సమీక్ష నిర్వహించి  తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారని తెలిపా రు. సమావేశంలో కరీంనగర్‌ జడ్పీటీసీ పురమల్ల లలిత శ్రీనివాస్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, నాయకులు చల్ల హరిశంకర్‌, పిట్టల రవీం దర్‌, పిల్లి మహేశ్‌, తిప్పర్తి లక్ష్మయ్య, పురమల్ల శ్రీనివాస్‌, రాజేశ్వర్‌రావు, పలువురు ప్రజాప్రతినిధు లు, నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-02-16T09:42:08+05:30 IST