-
-
Home » Telangana » Karimnagar » trs leaders need to keep their mouths shut in jagithyal
-
టీఆర్‌ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి
ABN , First Publish Date - 2020-12-11T05:23:51+05:30 IST
స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీ అర్వింద్‌పై ఇష్టం వచ్చినట్లుగా అసభ్యపదజాలంతో మాట్లాడడం సరి కాదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి సూచించారు.

బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి
జగిత్యాల అర్బన్, డిసెంబరు 10 : స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీ అర్వింద్‌పై ఇష్టం వచ్చినట్లుగా అసభ్యపదజాలంతో మాట్లాడడం సరి కాదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి సూచించారు. గురువారం జిల్లా బీజేపీ కా ర్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభు త్వం నియంత్రిత సాగు విధానంతో రైతాంగాన్ని నట్టేట ముంచారని వి మర్శించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తూ ప్రభుత్వం తరుపున కొనుగోలు చేయాలని, లక్ష రూపాయల వ్యవసాయ రుణాన్ని ఏకకాలం లో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కృష్ణహరి, పట్టణాధ్యక్షులు అనిల్‌కుమార్, శ్రీధర్, సాయి, రవితేజ, రాజన్న, నారాయణరెడ్డి, రాజేష్ తదితరులున్నారు.
అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
బీజేపీ నాయకులపై గానీ, కార్య కర్తలపై గానీ అనుచిత వ్యాఖ్యలు చే స్తే ఊరుకునేది లేదని, బీజేపీని యోజకవర్గ ఇన్‌ఛార్జ్ రవీందర్‌రెడ్డి టీ ఆర్‌ఎస్ నాయకులను హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రూపొందిస్తే, రైతు సంక్షేమం ప ట్టని టీఆర్‌ఎస్ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ద ళారుల చేతిలో మద్దతు ధర దక్కక రైతులు మోసపోతున్నారని విమ ర్శించారు. రైతు సంక్షేమం కాక్షించిన ప్రధాని మోదీ రైతులు తమ పంటను మద్దతు ధరను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారన్నారు. వ్యవసాయ చట్టాన్ని నవీనికరించడానికే ఈ చట్టాలు రూపొందిస్తే, ప్రతిపక్షాలు సహక రించకుండా చట్టాలనే వ్యతిరేకించడం మూర్ఖపు చర్య అన్నారు.
టీఆర్‌ఎస్ నాయకులపై బీజేపీ ఫిర్యాదు
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బీజేపీ నాయకులు గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ జయే ష్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వ్యక్తిగత దూషణలకు దిగిన టీఆర్‌ఎస్ నేతలపై కేసులు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసు కోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుర్రం రాము, నాయకులు రాజు, అరుణ్, జ్ఞానేశ్వర్, బిట్టు తదితరులున్నారు.